చిన్న పిల్లల్లో డయాబెటిస్ గుర్తించడం ఎలా.?
- April 10, 2023
డయాబెటిస్‌కి వయసుతో సంబంధం లేదు. కొన్ని జన్యుపరమైన రీజన్స్, ఒక పర్టిక్యులర్ ఏజ్‌లో మాత్రమే డయాబెటిస్ ఎటాక్ చేసేది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు బొత్తిగా కనికరం లేకుండా పోయింది. కడుపులోని బిడ్డను సైతం వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి.
మరి చిన్న పిల్లల్లో డయాబెటిస్‌ని గుర్తించడం ఎలా.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టొచ్చు.?
పిల్లలు పదే పదే యూరిన్‌కి వెళ్లడం, అధిక దాహంతో వున్నట్లు కనిపించడం, ఊరికే అలసిపోవడం, వెయిట్ లాస్ తదితర లక్షణాలు వారిని డయాబెటిక్స్గా గుర్తించేందుకు ఆస్కారం కలిగిస్తాయ్. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
ఇక, జాగ్రత్తల విషయానికి వస్తే, ఫుడ్‌లో కంపల్సరీ బీన్స్, క్యారెట్, చీజ్‌తో పాటూ అన్ని రకాల తాజా కూరగాయల్నీ ఆహారంలో భాగం చేయాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. ఫైబర్ రిచ్ ఆహారాన్ని ఎక్కువగా అందించాలి.
అధిక మొత్తంలో షుగర్ మిక్స్ చేసిన జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్, స్వీట్ లస్సీల వంటివి అవాయిడ్ చేయాలి. ఇవి అనవసరమైన క్యాలరీలను పెంచేస్తాయ్. రక్తంలో షుగర్ స్థాయిని కూడా అధికం చేస్తాయ్. తస్మాత్ జాగ్రత్త.
తాజా వార్తలు
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం









