ఈద్ అల్ ఫితర్ సెలవులు: వీసా లేకుండా ప్రయాణించగల దేశాల జాబితా
- April 10, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా నాలుగు రోజుల వారాంతంలో పెద్ద సంఖ్యలో యూఏఈ జాతీయులు, ప్రవాసులు వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లడం వలన విమాన ప్రయాణం డిమాండ్ పుంజుకుంటుంది. యూఏఈ పౌరులకు వీసా-రహిత యాక్సెస్ లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని అందించే అనేక ప్రసిద్ధ, పర్యాటక-స్నేహపూర్వక గమ్యస్థానాలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. యూఏఈ పాస్పోర్ట్ వారు ముందస్తు వీసా లేకుండా 178 దేశాలకు వెళ్లవచ్చు.
హెన్లీ & పార్ట్నర్స్ ప్రకారం.. యూఏఈ పౌరులు 141 దేశాలకు వీసా-రహిత ప్రవేశాన్ని.. 44 దేశాలలో వీసా-ఆన్-అరైవల్ లేదా ఎలక్ట్రిక్ ట్రావెల్ అథారిటీ (ETA)ని పొందవచ్చు. యూఏఈ పౌరులు ఓషియానియాలోని 16 దేశాలు, మధ్యప్రాచ్యంలో 13, ఐరోపాలో 50, కరేబియన్లో 17, ఆసియాలో 12, అమెరికాలో 20 మరియు ఆఫ్రికాలో 38 దేశాలలో వీసా రహిత యాక్సెస్ పొందవచ్చు. అయితే, యుఎస్, ఆస్ట్రేలియా, టర్కీయేతో సహా 48 దేశాలకు ప్రయాణించే ముందు వీసా పొందవలసి ఉంటుంది.
యూఏఈ పౌరులు వీసా-రహిత ప్రవేశం లేదా వీసా-ఆన్-అరైవల్ పొందే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలున్న దేశాలు.. కెనడా, న్యూజిలాండ్, యూకే, పాకిస్తాన్, చైనా, భారతదేశం, ఈజిప్ట్, ఫ్రాన్స్, జార్జియా, జర్మనీ, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్, సింగపూర్, హాంగ్ కొంగ, ఇటలీ, జపాన్, లెబనాన్, మొరాకో, రష్యా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, మాల్దీవులు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఖతార్.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







