2017-2021లో ఒమన్‌లో 14% తగ్గిన నేరాలు

- April 10, 2023 , by Maagulf
2017-2021లో ఒమన్‌లో 14% తగ్గిన నేరాలు

మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప నేరాల రేటుతో, నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన తాజా బులెటిన్ 2017 , 2021 మధ్య నేరాల రేటులో 14 శాతం తగ్గిందని వెల్లడించింది. 2021లో నేరస్థులలో 51 శాతం ప్రవాసులు కాగా.. ఒమానీ నేరస్థులు 49 శాతం ఉన్నారు. 2017లో క్రిమినల్ నేరాల సంఖ్య 14,826కి చేరుకోగా, నేరస్థుల సంఖ్య 20,797కి చేరుకుంది. మరుసటి ఏడాది నేరాల సంఖ్య 14,726కి చేరగా, నేరస్తుల సంఖ్య 21,318కి చేరింది.  2019లో నేరస్తుల సంఖ్య 20,967 కాగా, నమోదైన నేరాలు 14,871. అయితే, 2021లో నేరాల్లో తగ్గుదల నమోదైంది. నేరాల సంఖ్య 11,312కి పడిపోయింది. ఇది 2017-2021 కాలంలోనే అత్యల్పం కావడం గమనార్హం.ఇక 2021లో నేరస్థుల సంఖ్య 16,672, ఇది కూడా నాలుగేళ్ల కాలంలో అతి తక్కువ కావడం విశేషం.2021లో 12,812 నేరాలు నమోదు కావడంతో నేరాల సంఖ్య స్వల్పంగా పెరిగగా.. నేరస్తుల సంఖ్య 18,357కి పెరిగింది.

సుల్తానేట్ 2020తో పోలిస్తే 2021లో నేరాల సంఖ్య 13% పెరిగింది. మస్కట్ గవర్నరేట్‌లో అత్యధికంగా 37.3 శాతం నేరాలు నమోదుకాగా..  నేరస్థులు 34.4 శాతం ఉన్నారు. ఉత్తర అల్ బతినా గవర్నరేట్ రెండవ అత్యధిక నేరాల రేటు 16.4 శాతం కాగా.. నేరస్థులు 16.5 శాతం ఉన్నారు. ధోఫర్ గవర్నరేట్ నేరాల రేటు 13.2 శాతం ఉండగా.. 15.6 శాతం నేరస్థుల సంఖ్య. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ నేరాల రేటు 8.9 శాతం నమోదు కాగా, 9 శాతం నేరస్థులను కలిగి ఉంది. అల్ దఖిలియా గవర్నరేట్ తక్కువ శాతం నేరాల రేటు (6.8 శాతం), నేరస్థులు (6.3 శాతం) ఉన్నారు. ఉత్తర, దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లలో నేరాల రేటు 4.7 శాతం ఉంది.  అల్ బురైమి గవర్నరేట్ 3 శాతం క్రైమ్ రేటుతో ఉంది. అల్ దహీరా గవర్నరేట్‌లో 2.6 శాతం నేరాలు, సమాన సంఖ్యలో నేరస్థులు ఉండగా, అల్ వుస్తా గవర్నరేట్‌లో నేరాల రేటు 1.5 శాతం, 1.9 శాతం నేరస్థులు ఉన్నారు. ఒమన్ సుల్తానేట్‌లోని ముసందమ్ గవర్నరేట్‌లో నేరాల రేటు అత్యల్పంగా(0.9 శాతం) ఉంది. నేరస్థులు 1.2 శాతం మాత్రమే ఉన్నారు.

2021లో జరిగిన నేరాల్లో డబ్బు సంబంధిత నేరాలు అత్యధికంగా 32.2 శాతంగా ఉన్నాయి. వ్యక్తులపై నేరాలు 22.6 శాతంతో రెండవ స్థానంలో ఉన్నాయి. చట్ట ఉల్లంఘనలు 17.3 శాతం, డ్రగ్స్ సంబంధిత నేరాలు 13.4 శాతంగా ఉన్నాయి. 2021లో ఒమన్ సుల్తానేట్‌లో జరిగిన అత్యల్ప నేరాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌పై నేరాలు, ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడం 4.9 శాతం, మద్యపానం నేరాలు 2.9 శాతం, ప్రజా నైతికతకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు 2.2 శాతం,  ఆయుధాలను చట్టవిరుద్ధంగా ఉపయోగించడం/మందుగుండు సామాగ్రి సంబంధిత కేసులు 0.2 శాతం నమోదైనట్లు నివేదిక తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com