ప్రజల చేతుల్లోకి కొత్త Dh1,000 నోటు.. విశేషాలు
- April 10, 2023
యూఏఈ: మార్కెట్‌లో చెలామణి కోసం పాలిమర్‌తో తయారు చేయబడిన Dh1,000 డినామినేషన్ కొత్త నోటును యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) విడుదల చేసింది. కొత్త నోటు నేటి నుండి బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లలో అందుబాటులోకి వచ్చింది. కొత్త నోటు రూపకల్పనలో యూఏఈ ప్రపంచ విజయాలను ప్రతిబింబించే సాంస్కృతిక , అభివృద్ధి చిహ్నాలతో పాటు చిత్రాలను సెంట్రల్ బ్యాంక్ ఉపయోగించింది. అదే విధంగా కొత్త నోటు రూపకల్పనలో అంతరిక్ష పరిశోధనలో విజయాలను హైలెట్ చేసింది. ఈ నోటును ప్రజలు సులభంగా గుర్తించడానికి వీలుగా మధ్యలో ఫ్లోరోసెంట్ బ్లూ గుర్తులతో పాటు , అధునాతన ఇంటాగ్లియో ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించి రూపొందించిన డ్రాయింగ్‌లు, శాసనాలను పొందుపరిచారు. కొత్త నోటు ముందు వైపు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, 1974లో నాసా పయినీర్‌లతో జరిగిన సమావేశం నుండి ప్రేరణ పొందిన స్పేస్ షటిల్ మోడల్ చిత్రం ఉంది. ఇంధన వనరులను వైవిధ్యపరచడంలో.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేసేందుకు నోటు వెనుక భాగంలో అబుధాబిలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ చిత్రాన్ని ప్రింట్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







