ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు జీతాలు: షేక్ మొహమ్మద్
- April 11, 2023
యూఏఈ: యూఏఈ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, నాన్ ప్రాఫిట్ సంస్థల ఉద్యోగులు తమ ఏప్రిల్ నెల వేతనాలను ఏప్రిల్ 17న అందుకోనున్నారు. ఈ మేరకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ఈద్ సెలవులకు కుటుంబాలు షాపింగ్ చేయడానికి.. సిద్ధం కావడానికి ఈ నిర్ణయం మేలు చేయనుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. హిజ్రీ క్యాలెండర్లో రమదాన్ తర్వాత వచ్చే నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన పవిత్ర మాసం తర్వాత జరుపుకునే ఈద్ అల్ ఫితర్ పండుగ 2023లో మొదటి లాంగ్ వీకెండ్ గా ఉండనుంది. ఇది ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 23న ఎమిరేట్స్‌లో పవిత్ర మాసం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







