దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కు ఎంపికైన మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ ఆటగాళ్లు
- April 11, 2023
సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఏర్పాటు చేసిన "మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్" (MFCL) టోర్నమెంట్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. అందులో ఎంపికైన ముగ్గురు తెలుగు కార్మిక సోదరులను (ఉత్తమ ఆటగాళ్లు) పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, అక్కరమని గణేష్ కుమార్‌లను, ICA (Indoor Cricket Association, Singapore) వారు దుబాయ్‌లో 24-29 ఏప్రిల్ 2023 జరిగబోయే క్లబ్ వరల్డ్ సిరీస్, ఇండోర్ క్రికెట్ టోర్నమెంట్‌కు సింగపూర్ నుండి ICA తరఫున ఎంపిక చేసి పంపుతున్నారని, టీం కెప్టెన్‌గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలియచేసారు.
"మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్" (MFCL) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయ్ ఇన్డోర్ క్రికెట్ సిరీస్ కి ఎంపిక అవ్వడం పట్ల టోర్నమెంట్ నిర్వాహుకులు గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, S కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులు హర్షం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సంస్థ తరఫున క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, ఈ టోర్నమెంట్ లో కూడా విజయకేతనం ఎగురవేయాలని ఆకాక్షించారు.
టోర్నమెంట్ మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి https://www.clubworldseries.com/

తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









