ఇరాన్-సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య విమానాలు పునరుద్ధరణ
- April 11, 2023
టెహ్రాన్: ఇరాన్ మరియు సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దౌత్య సంబంధాలకు సన్నాహాలు పూర్తయ్యాయని, ఈ వారంలో ఇరాన్ ప్రతినిధి బృందం సౌదీ రాజధాని రియాద్‌కు వెళుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి అలీ రెజా ఎనయటి పేర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా నుండి ఓ సాంకేతిక ప్రతినిధి బృందం ఇరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి.. వాణిజ్య విమానాల పున: ప్రారంభానికి సంబంధించిన అంశాలను చర్చిస్తుందని అన్నారు.
దౌత్య సంబంధాల పునరుద్ధరణతో పాటు రెండు నెలల్లో రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యకలాపాలను పున: ప్రారంభించడంపై చైనా అధ్యక్షుడు చొరవతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మార్చి 10న ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, సౌదీ రాజు ఫైసల్ బిన్ ఫర్హాన్‌లు బీజింగ్‌లో సమావేశమై సంయుక్త ప్రకటనపై సంతకం చేసినట్లు మీడియా తెలిపింది. అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణమయ్యేందుకు బీజింగ్ మధ్యవర్తిత్వ ఒప్పందం సానుకూల ప్రభావాన్ని చూపిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు వాణిజ్య , ఆర్థిక సంబంధాలు మెరగయ్యేందుకు దోహదం చేస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









