ఢిల్లీ-మస్కట్ విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- April 11, 2023
మస్కట్: భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసింది. ట్రావెల్ ఏజెంట్లందరికీ ఏప్రిల్ 10న జారీ చేసిన సర్క్యులర్ (15/23) ప్రకారం.. “ఢిల్లీ-మస్కట్ ఫ్లైట్ సర్వీసును ఏప్రిల్ 29, మే 6, మే 13, మే 14, మే 20, మే 27 వ తేదీల్లో రద్దు చేయబడింది.’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఆయా తేదీల్లో మస్కట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ వెంటనే తెలియజేయాలని ఆ సర్క్యులర్‌లో కోరారు. ప్రయాణీకులు ఎలాంటి పెనాల్టీలు లేకుండా పూర్తి రీఫండ్‌ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీల్లో సీట్లను రీబుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది.
తాజా వార్తలు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్‌లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!









