పాదచారుల ప్రమాదాల నిరోధానికి స్మార్ట్ సిగ్నల్స్
- April 11, 2023
దుబాయ్: ‘స్మార్ట్ పాదచారుల సిగ్నల్స్’ ప్రాజెక్ట్ రెండవ దశను దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో 10 కొత్త ప్రాంతాలలో సిగ్నల్స్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తంగా 2024 నాటికి స్మార్ట్ పాదచారుల సిగ్నల్‌ల సంఖ్యను 28కి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. మొదటి దశలో ఈ సిగ్నళ్లను అమర్చిన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పాదచారుల భద్రతను ఈ వ్యవస్థ మెరుగుపరిచిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెన్సార్‌ల ఆధారంగా స్మార్ట్ సిగ్నల్ లైట్ ఆపరేషన్ పనిచేస్తుంది. పేవ్‌మెంట్‌పై (వీధిని దాటడానికి ముందు), పాదచారుల క్రాసింగ్‌పై (దాటుతున్నప్పుడు) పాదచారుల కదలికను ఈ సెన్సార్లు గుర్తిస్తాయని, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పాదచారుల భద్రతను గణనీయంగా పెంచుతుందని, సిగ్నల్ టైమింగ్ మెరుగైన నిర్వహణను నిర్ధారిస్తుందని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్ మొహమ్మద్ అల్ అలీ వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







