ఐకానిక్ మస్జీదు ‘వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం’ ప్రారంభం

- April 12, 2023 , by Maagulf
ఐకానిక్ మస్జీదు ‘వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం’ ప్రారంభం

దుబాయ్: దుబాయ్ జుమేరా మస్జీదు ఆవరణలో ఇప్పుడు కొత్త మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటుంది. అరుదైన కళాఖండాలు, ఐకానిక్ ఛాయాచిత్రాలు, పాతకాలపు వస్తువులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుమేరా మస్జీదు మజ్లిస్‌లోని మొదటి అంతస్తులో ఉన్న వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం సోమవారం నాడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. షేక్ మొహమ్మద్ సెంటర్ ఫర్ కల్చరల్ అండర్స్టాండింగ్ (SMCC) వ్యవస్థాపకుడు అబ్దుల్లా బిన్ ఈసా అల్ సెర్కల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమిరాటీస్, విదేశీయుల మధ్య పరస్పర సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహిస్తుందన్నారు. ఎమిరాటీస్‌ను జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోందన్నారు.

ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ మస్జీదుల ప్రదర్శన, UAE స్థాపనను ప్రకటిస్తూ డిసెంబర్ 2, 1971 నుండి అల్ ఇత్తిహాద్ వార్తాపత్రిక మొదటి పేజీని ప్రదర్శించే ప్రదర్శనతో సహా అనేక ఆకర్షణీయమైన విభాగాలు ఉన్నాయి. సందర్శకులు ఓడ తయారీ సాధనాలు, నషాబా (చెక్క కాటాపుల్ట్), రహా (60వ దశకంలో ఎమిరాటీ ఇళ్లలో పిండి మరియు ధాన్యాన్ని రుబ్బుకోవడానికి ఉపయోగించే రాయి గ్రైండర్) ఇతర కళాఖండాలను ఒకే చోట చూడవచ్చు. వారానికి ఆరు రోజులపాటు.. అన్ని మతాల సందర్శకులకు మ్యూజియం ఆహ్వానం పలుకుతుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం శుక్రవారాల్లో తప్ప ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు తెరిచి ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com