ఉల్లంఘనలకు పాల్పడుతున్న డెలివరీ బైక్ డ్రైవర్లు: ఆర్టీఏ
- April 12, 2023
యూఏఈ: ఇటీవలి తనిఖీలో డెలివరీ బైక్ డ్రైవర్లు అనేక తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. భద్రతా మార్గదర్శకాలను పాటించడంలో వైఫల్యం, సేఫ్టీ గేర్లను సరిగ్గా ఉపయోగించకపోవడం, గడువు ముగిసిన లైసెన్స్‌లతో వాహనాలను నడపడం లాంటి తీవ్రమైన ఉల్లంఘనలు ఉన్నాయని పేర్కొన్నారు. 2022 మూడవ త్రైమాసికంలో ప్రారంభించిన ప్రచారాలు 2023 చివరి వరకు కొనసాగుతాయని తెలిపింది. ఇప్పటివరకు 7,000 కంటే ఎక్కువ డెలివరీ బైక్‌లు తనిఖీ చేయబడ్డాయని ఆర్టీఏ పేర్కొంది.
RTA లైసెన్సింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ డైరెక్టర్ ముహన్నద్ అల్ మ్హీరి మాట్లాడుతూ.. డెలివరీ బైక్ డ్రైవర్లు భద్రతా నిబంధనలను పాటించడంలో వైఫల్యం, రక్షణ పరికరాలు, రిఫ్లెక్టివ్ వెస్ట్‌లు ధరించకపోవడం, బైక్‌లను ఆపరేట్ చేయడం వంటి అనేక పునరావృత ఉల్లంఘనలను తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపారు. గడువు ముగిసిన లైసెన్స్‌లు, RTA నుండి అనుమతులు తీసుకోకుండానే డెలివరీ బైక్‌లపై ప్రకటన సామగ్రిని అతికించడం లాంటి ఉల్లంఘలను ఉన్నాయని చెప్పారు. లైసెన్సింగ్ ఏజెన్సీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA), సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో, దుబాయ్‌లోని డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లపై ఇప్పటికే అనేక అవగాహన మరియు తనిఖీ ప్రచారాలను నిర్వహించిందన్నారు. డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఎడ్యుకేషనల్ మెటీరియల్ 2021 అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్ నం. 9 కింద జాబితా ప్రకారం.. డెలివరీ సర్వీస్ బిజినెస్ చేయడానికి ఆమోదించబడిన కార్డ్ కలిగి ఉండటం, డెలివరీ బైక్ డ్రైవర్లకు సాంకేతిక అవసరాలు, రైడింగ్ చేసేటప్పుడు యూనిఫాంలు.. రక్షణ గేర్లను తప్పనిసరిగా ధరించడం, డెలివరీ డ్రైవర్లకు ప్రొఫెషనల్ శిక్షణ పూర్తి చేయడం, గరిష్టంగా 100 km/h మోటార్‌సైకిల్ వేగానికి కట్టుబడి ఉండటం వంటి నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







