100 దేశాల్లో ‘దుబాయ్ ఫౌండేషన్’ సేవా కార్యక్రమాలు: షేక్ మొహమ్మద్
- April 12, 2023
యూఏఈ: 2022లో మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) 100 దేశాల్లోని 102 మిలియన్ల ప్రజలకు Dh1.4 బిలియన్ల విలువైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను అందించిందని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. మంగళవారం దుబాయ్ ఒపెరాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. MBRGI ఇయర్ ఇన్ రివ్యూ నివేదిక ప్రకారం.. సంస్థ 2021తో పోల్చితే 11 మిలియన్ల మంది లబ్ధిదారులు పెరిగారు. అదే సమయంలో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు 100 దేశాలకు విస్తరించింది. ఈ వేడుకలో గత సంవత్సరంలో MBRGI సాధించిన విజయాలను ప్రస్తావించారు. అలాగే 1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్ ప్రచారానికి సంబంధించి సేవలు అందించిన పలువురిని సత్కరించారు.
వాలంటీర్ల సంఖ్య పెంపు
MBRGIతో స్వచ్ఛందంగా సేవలందిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, సంస్థ చరిత్రలో రికార్డు స్థాయిని నెలకొల్పిందని వార్షిక నివేదిక వెల్లడించింది. 847 మంది ఉద్యోగుల బృందంతో పాటు.. MBRGI 150,266 మంది వాలంటీర్లు కొత్తగా సేవా కార్యక్రమాల్లో చేరారు. 2021లో 5,330 మంది వాలంటీర్లు మాత్రమే పెరిగారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్చ MBRGI ట్రస్టీల బోర్డు వైస్-ఛైర్మెన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ సందర్భంగా వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం 1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్ ప్రచారం ప్రారంభించిన 15 రోజులలో మొత్తం Dh514 మిలియన్ల సహకారాన్ని నమోదు చేసింది. 2021తో పోలిస్తే 2022లో ఫౌండేషన్ తన వ్యయాన్ని 300 మిలియన్ దిర్హామ్‌లు పెంచిందని, విద్య, పని, ఆరోగ్య రంగాలలో మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరచడానికి తమకు వీలు కల్పిస్తుందని MBRGI సెక్రటరీ జనరల్ మహ్మద్ అబ్దుల్లా అల్ గెర్గావి వెల్లడించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







