ఇఫ్తార్ పంపిణీకి డబ్బులు చెల్లిస్తే..Dh300,000 జరిమానా!

- April 13, 2023 , by Maagulf
ఇఫ్తార్ పంపిణీకి డబ్బులు చెల్లిస్తే..Dh300,000 జరిమానా!

యూఏఈ: అబుధాబిలో పంపిణీ చేయడానికి ఇఫ్తార్ భోజనాన్ని సిద్ధం చేయడానికి రెస్టారెంట్లు, క్యాటరర్లకు చెల్లించడం మానుకోవాలని పౌరులు,నివాసితులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (DCD) అబుధాబి సూచించింది. దీనికి బదులుగా స్వచ్ఛంద విరాళాలు, ఆర్థిక సహకారాలు అబుధాబిలోని లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా మాత్రమే అందించాలని కోరింది. "అనుమతి పొందకుండానే విరాళాలు సేకరించడం లేదా స్వీకరించడం చేస్తే.. Dh150,000 - Dh300,000 మధ్య జరిమానా, జైలుశిక్ష విధించే అవకాశం ఉందని DCD హెచ్చరించింది.    

ఇఫ్తార్ విందులను సిద్ధం చేయడానికి అవుట్‌సోర్సింగ్, రెస్టారెంట్‌లకు చెల్లించడం 2021 ఫెడరల్ లా నంబర్ (3), యూఏఈలో నిధుల సేకరణ కార్యకలాపాలు, విరాళాలను నియంత్రించే దాని బైలాను ఉల్లంఘించడమేనని డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. అబుధాబిలో విరాళాలను సేకరించడం, నిర్వహించేందుకు DCD నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. నిధుల సేకరణ లైసెన్స్ పొందిన సంస్థలు మినహా.. స్వచ్ఛంద సంస్థలు, సమాఖ్య, స్థానిక మరియు పౌర సంస్థలు చట్టాల ద్వారా అనుమతించబడతాయని డీసీడీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com