ఒమన్ తీరంలో 5.8 తీవ్రతతో భూకంపం
- April 13, 2023
మస్కట్: ఒమన్లోని అరేబియా సముద్ర తీరంలో గురువారం ఉదయం 5.8 తీవ్రతతో భూకంపం నమోదైందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది. ఒమన్లోని ఓడరేవు నగరమైన సుర్కు 500 కిలోమీటర్ల దూరంలో సముద్రం దిగువన 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) భూకంపం తీవ్రత 5.4 గా అంచనా వేసింది. యూఏఈపై భూకంప ప్రభావం లేదని, ఎక్కడా భూకంప ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం అందలేదని ఎన్సిఎం డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. అరేబియా సముద్రంలో ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







