మహిళను దోచుకున్న నలుగురు ప్రవాసులకు జైలుశిక్ష

- April 13, 2023 , by Maagulf
మహిళను దోచుకున్న నలుగురు ప్రవాసులకు జైలుశిక్ష

యూఏఈ: దుబాయ్‌లో ఓ మహిళ నుంచి 42,000 దిర్హామ్‌లు దోచుకున్న నలుగురు ఆసియన్లకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. వారు ఆమెపై దాడి చేసి, వివస్త్రను చేసి, ఆమె డబ్బును బిట్‌కాయిన్‌గా మార్చారని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లోని పత్రాల ప్రకారం..  డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేయాలని ముఠా సభ్యుల్లో ఒకరితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తనను కిడ్నాప్ చేసి, దాడి చేసి, దోచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఠాలోని ఓ వ్యక్తి ఆ మహిళకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముఠాలోని మిగిలిన వారితో కలిసి ప్లాన్ చేసి, ఆమెను ఒక బోగస్ డీల్‌కు ఒప్పించాడు. అనంతరం దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్క్‌లోని నిర్దేశిత ప్రదేశానికి వచ్చినప్పుడు తనపై దాడిచేసి డబ్బును బలవంతంగా వారి అకౌంట్ కు బదిలీ చేశారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. "నాపై దాడి చేశారు వివస్త్రను చేసి  ఫోటోలు తీశారు. ఎవరికైనా చెబితే ఫోటోలు అన్ లైన్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రాంతంలో విడిచిపెట్టి పరారయ్యారు.." అని ఆమె అధికారులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముఠా సభ్యులను గుర్తించారు. కోర్టు రికార్డుల ప్రకారం, మహిళకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్‌లను ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారించిన కోర్టు ముఠా సభ్యులకు జైలు శిక్షతో పాటు   Dh42,000 జరిమానా విధించింది. జైలుశిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com