ఆటిస్టిక్ పిల్లలతో సరదాగా గడిపిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
- April 13, 2023
యూఏఈ: దృఢ సంకల్పం(ఆటిస్టిక్)తో కూడిన పిల్లల బృందం బుధవారం ఎమిరేట్స్ టవర్ హోటల్లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌తో సంభాషించే అవకాశం లభించినందుకు పిల్లలు ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వారితో సంభాషిస్తూ.. వారిలో ఉత్సాహాన్ని నింపారు. కొంతమంది పిల్లలు క్రౌన్ ప్రిన్స్ తో కలిసి ఉన్న క్షణాలను సెల్ఫీలలో బంధించారు. అనంతరం షేక్ హమ్దాన్ మాట్లాడుతూ.. ఎమిరేట్‌లో దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులకు అందించబడుతున్న ఉన్నత ప్రమాణాల సంరక్షణ, సేవలు వారిని సమాజంలో ఏకం చేయాలనే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. దుబాయ్ నాయకత్వం దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, దృఢ సంకల్పం ఉన్న ప్రజలందరూ అత్యధిక నాణ్యత గల సేవలను పొందేందుకు అర్హులు అని చెప్పారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం, పిల్లలు, వారి కుటుంబాలతో సంభాషించడం చాలా ఆనందంగా ఉందని షేక్ హమ్దాన్ అన్నారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







