ఆటిస్టిక్ పిల్లలతో సరదాగా గడిపిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

- April 13, 2023 , by Maagulf
ఆటిస్టిక్ పిల్లలతో సరదాగా గడిపిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

యూఏఈ: దృఢ సంకల్పం(ఆటిస్టిక్)తో కూడిన పిల్లల బృందం బుధవారం ఎమిరేట్స్ టవర్ హోటల్‌లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌తో సంభాషించే అవకాశం లభించినందుకు పిల్లలు ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వారితో సంభాషిస్తూ.. వారిలో ఉత్సాహాన్ని నింపారు. కొంతమంది పిల్లలు క్రౌన్ ప్రిన్స్ తో కలిసి ఉన్న క్షణాలను సెల్ఫీలలో బంధించారు. అనంతరం షేక్ హమ్దాన్ మాట్లాడుతూ.. ఎమిరేట్‌లో దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులకు అందించబడుతున్న ఉన్నత ప్రమాణాల సంరక్షణ, సేవలు వారిని సమాజంలో ఏకం చేయాలనే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. దుబాయ్ నాయకత్వం దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, దృఢ సంకల్పం ఉన్న ప్రజలందరూ అత్యధిక నాణ్యత గల సేవలను పొందేందుకు అర్హులు అని చెప్పారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం, పిల్లలు, వారి కుటుంబాలతో సంభాషించడం చాలా ఆనందంగా ఉందని  షేక్ హమ్దాన్ అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com