ఈద్ అల్ ఫితర్ సెలవులు: టాప్ 6 హాలిడే స్పాట్లు, ప్యాకేజీలు
- April 13, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ 4-రోజుల సుదీర్ఘ వారాంతానికి యూఏఈ నివాసితులు సిద్ధమవుతున్నారు. ట్రావెల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది నివాసితులు బడ్జెట్, వీసా-ఫ్రెండ్లీ దేశాలు(ప్రాంతాలు) వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. " రమదాన్ సెలవుల్లో ప్రయాణాలకు అజర్బైజాన్, జార్జియా, అర్మేనియా వంటి CIS దేశాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే సింగపూర్, కెన్యా, థాయ్‌లాండ్, మలేషియాతో పాటు కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ లకు కూడా ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది." అని Musafir.com COO రహీష్ బాబు చెప్పారు. స్కెంజెన్ దేశాలైన యూకే,యూఎస్, కెనడా వీసాలు లభించడం ఇప్పటికీ సవాలుగా ఉన్నందున, వీసాలు పొందడం ఇబ్బంది లేని దేశాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా Dh3000-4000 పరిధిలో హాలిడే ప్యాకేజీలకు ఫుల్ డిమాండ్ ఉంది.
యూఏఈలో అధికారిక ఈద్ అల్ ఫితర్ సెలవులు రమదాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు (హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు) ఉంటుంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఈద్ ఎక్కువగా ఏప్రిల్ 21వ తేదీ (శుక్రవారం) వస్తుంది. అలా అయితే, ఏప్రిల్ 20 ( గురువారం) నుండి ఏప్రిల్ 23 (ఆదివారం) వరకు రమదాన్ సెలవులు ఉంటాయి. ఒకవేళ ఈద్ ఏప్రిల్ 22( శనివారం) అయితే, ఏప్రిల్ 24( సోమవారం)న అదనపు సెలవు దినాన్నిప్రకటిస్తారు .
టాప్ 6 గమ్యస్థానాలు, వాటి వివరాలు:
మారిషస్
మారిషస్ ద్వీపం తెల్లని ఇసుక బీచ్‌లు ప్రసిద్ధి. ఇక్క ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ రిసార్ట్లు అనేకం ఉన్నాయి. అలాగే పర్వత ప్రకృతి దృశ్యాలు, పగడపు దిబ్బలు, అభివృద్ధి చెందుతున్న సముద్ర జీవులు ప్రపంచ స్థాయి డైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. పర్యాటకుల స్వర్గధామంగా పేరుగాంచిన మారిషస్‌లో కుటుంబాలు వాటర్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. Dnata ప్రకారం.. ఒక్కొక్కరికి Dh5,950 నుండి మారిషస్‌కు ప్యాకేజీలు ప్రారంభమవుతాయి.
కెన్యా
సహజ ప్రకృతి సౌందర్యం, అరణ్యాలు మరియు ప్రత్యేకమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందిన కెన్యాకు హాలిడే ట్రిప్ వేసేందుకు యూఏఈ వాసులు ఆసక్తి చూపుతున్నారు. మసాయి మారా సఫారి సింహాలు, ఆఫ్రికన్ చిరుతలు, ఏనుగులకు అక్కడి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రిజర్వ్ ఫారెస్టులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో నల్ల ఖడ్గమృగాలు ఉన్నాయి. 60 జాతుల జంతువులతో పాటు 450 జాతుల పక్షులను అక్కడ చూడవచ్చు. Musafir.com ప్రకారం.. ప్యాకేజీల ధరలు Dh4,799 నుండి ప్రారంభమవుతాయి.
అజర్బైజాన్
బాకు నగరం, గుబా, షేకి, నఖ్చివాన్ ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా సందర్శిస్తారు. యూఏఈ నివాసితులలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశం. యూఏఈ నివాసితులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని అందిస్తుంది. అల్హింద్ బిజినెస్ సెంటర్ అజర్‌బైజాన్‌కు Dh2,688 నుండి ఒక ప్యాకేజీని అందిస్తుంది. ఇందులో టిక్కెట్లు, హోటల్ వసతి, ఇతర ఖర్చులు ఉన్నాయి.
కిర్గిజ్స్తాన్
కిర్గిజ్స్తాన్ మూడు UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయంగా ఉంది. టియన్ షాన్ పర్వత శ్రేణి, చారిత్రాత్మక సిల్క్ రోడ్, క్రిస్టల్-క్లియర్ పర్వత సరస్సులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఫ్లైదుబాయ్ కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్కి ఈద్ సెలవుల్లో సుమారు Dh2,000కి విమాన సర్వీసులను అందిస్తోంది.
జార్జియా
బకురియాని పర్వతాల నుండి స్కీయింగ్ చేయడం వరకు, అరగ్వి నదిలో రాఫ్టింగ్ చేయడం లేదా 4,000 మీటర్ల ఎత్తులో స్టార్‌గేజింగ్ చేయడం వరకు, దేశం సందర్శకులు ఎంచుకోవడానికి అనేక ఉత్తేజకరమైన కార్యకలాపాలను అందిస్తుంది. యూఏఈ పౌరులు, నివాసితులకు వీసా ఆన్ అరైవల్‌ను అందించడం ప్రారంభించినప్పటి నుండి జార్జియా అగ్ర ప్రయాణ గమ్యస్థానంగా మారింది. అక్బర్ ట్రావెల్స్ జార్జియాకు 5 పగలు, 4 రాత్రి ప్యాకేజీని Dh2,846 నుండి అందిస్తోంది.
జోర్డాన్
ఆధునికత, సంప్రదాయాల కలయికతో జోర్డాన్.. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, బీయాకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశం లెక్కలేనన్ని ప్రకృతి అద్భుతాలకు నిలయంగా ఉంది. డెడ్ సీ.. సహజ అద్భుతం. ఇది సముద్ర మట్టానికి 427 మీటర్ల దిగువన ఉంది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించే ప్రధాన పర్యాటక ఆకర్షణ. AFC హాలిడేస్ 5 పగలు, 4 రాత్రి ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. దీని ధరలు ఒక్కొక్కరికి Dh4,999 నుండి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







