అవినీతి ఆరోపణలు.. పలువురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్
- April 14, 2023
జెడ్డా: లక్షలాది రియాల్స్‌తో కూడిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు పౌరులు, ప్రవాసులను అరెస్టు చేసినట్లు పర్యవేక్షణ , అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిపై లంచం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయి. వారిపై చట్టపరమైన చర్యలను పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని నజాహా వెల్లడించింది.
కేసుల వివరాలను వివరిస్తూ.. ప్రవాస కార్మికుల వృత్తి మార్పు కోసం SR6.6 మిలియన్ల మొత్తాన్ని పొందినందుకు ఒకరిని, ఫైనల్ ఎగ్జిట్ వీసాను అక్రమ పద్ధతిలో రద్దు చేసినందుకు మరోకరిని, రాష్ట్ర ఖజానాకు SR75.75 మిలియన్లు ఎగ్గొట్టిన కేసులో మరికొందరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే యూనివర్సిటీలో SR6496304ను దుర్వినియోగం చేసిన కేసులో డైరెక్టర్, ఎగ్జిక్యూషన్ కోర్ట్ ఖాతా నుండి SR8.84 మిలియన్లను దొంగిలించినందుకు ఓ ప్రవాసుడిని, ప్రాజెక్టులలో మోసాలు తదితర కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురుని అరెస్ట్ చేసినట్లు నజాహా తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







