యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలు: వచ్చే 4 ఏళ్లలో ఆ దేశాలదే సింహాభాగం...!
- April 14, 2023
యూఏఈ: భారతదేశం, చైనా, యూకే ప్రయాణికులు రాబోయే నాలుగు సంవత్సరాలలో యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను శాసించనున్నారు. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. విమాన ప్రయాణంలో పునరుద్ధరణ యూఏఈ ప్రీ-పాండమిక్ స్థాయిల కంటే ఇన్‌బౌండ్ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను గణనీయంగా పెంచింది. సగటున ప్రతి ప్రయాణికుడి వ్యయం $100ని దాటింది. యూఏఈ మహమ్మారి సమయంలో ప్రయాణ, పర్యాటక సంక్షోభాన్ని ఎదుర్కొందని, అనంతరం కాలంలో దుబాయ్, అబుధాబిలు రికార్డు స్థాయిలో డ్యూటీ ఫ్రీ అమ్మకాలను నమోదు చేశాయని అధ్యయనం తెలిపింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ 2022లో Dh6.34 బిలియన్ల ($1.74 బిలియన్లు) వార్షిక విక్రయాలను నమోదు చేయగా.. ఇది గత సంవత్సరం కంటే 78 శాతం అధికం కావడం విశేషం. అంతర్జాతీయ ప్రయాణీకుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయమైన దుబాయ్ ఇంటర్నేషనల్‌లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు కంటే ఎక్కువ (2022లో 66 మిలియన్లు) పెరిగింది. రాబోయే నాలుగేళ్లలో అవుట్‌బౌండ్ ప్రయాణీకుల వ్యయం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







