కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

- April 15, 2023 , by Maagulf
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘనవిజయం సాధించింది. కోల్‌కతా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 229 పరుగుల టార్గెట్ నిలిచింది. బ్రూక్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 20 ఓవర్లలో  205 పరుగులకు 7 కోల్పోయింది.

కోల్‌కతా పై హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుస వికెట్లు కోల్పోతూ కోల్‌కతా మ్యాచ్ లో తడబడింది. హైదరాబాద్‌ బౌలర్లు రాణించడంతో కోల్ కతా ఓటమి తప్పలేదు. రింకు సింగ్ 51,నితీశ్‌ రాణా 75 పరుగులతో రాణించారు.

హైదరాబాద్ బ్యాటింగ్ లో హ్యారీ బ్రూక్ 100 , ఐదెన్ మార్‌క్రమ్‌ 50, అభిషేక్ శర్మ 32, హెన్రిచ్‌ క్లాసెన్ 16 దూకుడుగా ఆడేశారు. దీంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లోనే అత్యధికంగా 228/4 స్కోరు సాధించింది.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com