మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా..
- April 16, 2023
ఇంఫాల్: 59వ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు శనివారం (ఏప్రిల్ 15న) మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మిస్ ఇండియాలు, ప్రముఖ బాలీవుడ్ నటీనటులు విచ్చేశారు. ఫైనల్ కి వచ్చిన టాప్ 30 కంటెస్టెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని 30 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఫైనల్ కి వచ్చారు. ఆ 30 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ లో తమ అందం, అభినయంతో మెప్పించారు.
ఈ సారి ఫెమినా మిస్ ఇండియా 2023 విన్నర్ గా ఆ 30 మంది సుందరీమణుల నుంచి రాజస్థాన్ కి చెందిన 19 ఏళ్ళ నందిని గుప్తా ఎంపికైంది. 59వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని నందిని గుప్తా అందుకుంది. గతేడాది మిస్ ఇండియాగా నిలిచినా సినీ శెట్టి కిరీటాన్ని నందిని గుప్తాకి అలంకరించింది. ఇక మొదటి రన్నరప్ గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా, రెండో రన్నరప్ గా మణిపూర్ కి చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ లు నిలిచారు.
ఈ ఏడాది మిస్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహన్ లు ఫైనల్ వరకు వెళ్లారు.ఇక విన్నర్స్ ని కార్యక్రమానికి విచ్చేసిన కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, పలువురు ప్రముఖులు అభినందించారు. నందిని గుప్తాకు దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో ఈమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







