బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
- April 17, 2023
రియాద్ : తూర్పు ప్రావిన్స్‌లోని ప్రత్యేక రహదారి భద్రతా దళాలు దమ్మామ్-రియాద్ హైవేపై తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయిన చిన్నారిని ఎట్టకేలకు గుర్తించింది. ఆరోగ్యంగా ఉన్న ఆ చిన్నారిని కుటుంబసభ్యులకు అప్పగించారు. “తూర్పు ప్రావిన్స్‌లోని డమ్మామ్-రియాద్ హైవేపై బాధితులు తమ వాహనాన్ని ఆపినప్పుడు.. చిన్నారి వాహనం నుంచి దిగింది. కానీ ఇది గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన పొరబాటును గుర్తించి.. తమ చిన్నారిని కాపాడాలని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు తప్పిపోయిన చిన్నారిని గుర్తించి వారి పేరెంట్స్ కు అప్పగించారు. ’’ అని స్పెషల్ రోడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. హైవే వినియోగదారులు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, రహదారులపై ప్రయాణించేటప్పుడు భద్రతా సూచనలను పాటించాలని వాహనదారులను ప్రత్యేక రహదారి భద్రతా దళాలు కోరాయి.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







