ప్రయాణీకుల నగదు, నగలు దొంగతనం.. ముగ్గురు విమానాశ్రయ సిబ్బంది అరెస్ట్
- April 17, 2023
యూఏఈ: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల బ్యాగుల్లోని డబ్బు, నగలను అపహరించిన ముగ్గురు కార్మికులను విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేశారు. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి.. మూడు నెలల జైలుశిక్ష విధించింది. అలాగే దోపిడి విలువకు సమానమైన 50,000 దిర్హామ్‌లను జరిమానా కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జైలు శిక్ష ముగిసిన తర్వాత కార్మికులను యూఏఈ నుండి బహిష్కరించాలని తన తీర్పులో పేర్కొంది. కాగా ఈ శిక్షను అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







