నేటి నుంచి ఉత్తర భారతంలో చార్‌ధామ్ యాత్ర
- May 09, 2016
ఉత్తర భారతంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రినాథ్, కేదార్‌నాథ్ ఆలయ దర్శనాల నిమిత్తం చార్‌ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీలోని గంగోత్రి, యమునోత్రి, రుద్రప్రయాగలోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి.
మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారని అధికారులు తెలిపారు. చమోలీ జిల్లాలోని మరో పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయ ద్వారాలు మే 11న తెరుచుకుంటాయి. చార్‌ధామ్ యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయా జిల్లా అధికారులు తెలిపారు. ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏటా శీతాకాలం సమయంలో ఆరు నెలలపాటు ఈ ఆలయాల ద్వారాలు మూసివేస్తారు. తిరిగి వేసవి కాలంలో దైవదర్శనాన్ని కల్పిస్తారు. 2013లో ఉత్తరాఖండ్‌లో వరదలు రావడంతో వేల సంఖ్యలో యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







