నెట్‌వర్కింగ్, రిఫరల్ మార్కెటింగ్ భవిష్యత్తుపై చర్చించిన BNI

- April 18, 2023 , by Maagulf
నెట్‌వర్కింగ్, రిఫరల్ మార్కెటింగ్ భవిష్యత్తుపై చర్చించిన BNI

బహ్రెయిన్‌: ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిజినెస్ రెఫరల్ నెట్‌వర్కింగ్ ఆర్గనైజేషన్, బహ్రెయిన్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (BNI)  ఇటీవల బహ్రెయిన్‌లో తన సభ్యుల సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఈ ప్రాంతంలోని అత్యంత ప్రముఖమైన, నిష్ణాతులైన వ్యాపార నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రీఫ్‌లోని విలాసవంతమైన రమీ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించారు.  బహ్రెయిన్‌లోని BNI జాతీయ డైరెక్టర్ అరుణోదయ్ గంగూలీ .. రాబోయే సంవత్సరాల్లో వృద్ధి, విస్తరణ కోసం సంస్థ ప్రణాళికలు, వ్యూహాలపై అవగాహాన కల్పించేలా ఓ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రాంతంలో నెట్‌వర్కింగ్, రిఫరల్ మార్కెటింగ్ భవిష్యత్తు గురించి హాజరైన వారికి విలువైన సూచనలు చేశారు. BNI కి 78 దేశాలలో సభ్యులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన వ్యాపార రిఫరల్ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com