నాని ‘దసరా’ సినిమాపై ఐకాన్ స్టార్ బన్నీ ప్రశంసల జల్లు.!

- April 18, 2023 , by Maagulf
నాని ‘దసరా’ సినిమాపై ఐకాన్ స్టార్ బన్నీ ప్రశంసల జల్లు.!

తాజాగా నాని నటించిన ‘దసరా’ సినిమాని అల్లు అర్జున్ వీక్షించాడు. నాని నటనకు మంత్ర ముగ్ధుడైపోయాడట బన్నీ. నానిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇది అసలు సిసలు ‘వేసవి దసరా’ అని నానితో పాటూ, కొత్త దర్శకుడైన శ్రీకాంత్ ఓదెలనీ, ‘దసరా’ టీమ్ మొత్తాన్నీ ప్రశంసలతో ముంచెత్తేశాడు అల్లు అర్జున్.

మొన్నీ మధ్యనే చిరంజీవికి స్పెషల్ షో వేసి సినిమా చూపించి, మెగాస్టార్ మెగా ప్రశంసలు దక్కించుకున్న నాని, తాజాగా బన్నీ ప్రశంసల్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. 

కీర్తి సురేష్ పాత్రకీ ఈ సినిమాలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయ్. మొత్తానికి వారాలు గడుస్తున్నా ‘దసరా’ మేనియా మాత్రం ఇంకా ఊపేస్తూనే వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com