రమదాన్ ముగిసే వరకు సౌదీలో వర్షాలు..!
- April 19, 2023
రియాద్: పవిత్ర రమదాన్ మాసం ముగిసే వరకు సౌదీ అరేబియాలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు. రాజ్యంలోని కొన్నిప్రాంతాలలో వర్షం, చురుకైన ఉపరితల గాలులు దుమ్మును కదిలించవచ్చని వెల్లడించారు. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో మంగళవారం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కురుస్తాయని NCM అంచనా వేసింది. రియాద్, హైల్, మదీనా, మక్కా మరియు అల్-ఖాసిమ్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, వడగళ్ళు- చురుకైన గాలులతో పాటు కుండపోత వర్షాలకు దారితీయవచ్చని NCM తెలిపింది. అల్-జౌఫ్, తబోక్, అల్-బహా, అసిర్, జజాన్, నజ్రాన్ ప్రాంతాలలో చురుకైన గాలులతో కూడిన ఉరుములు, అల్-షార్కియా ప్రాంతంలోని దక్షిణ ప్రాంతాల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







