సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన: ఏపీ సిఎం జగన్‌

- April 19, 2023 , by Maagulf
సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన: ఏపీ సిఎం జగన్‌

అమరావతి: శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రానున్న సెప్టెంబర్‌ నెల నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు.ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సిఎం జగన్‌ స్పష్టం చేశారు.

సిఎం జగన్‌ మాట్లాడుతూ ... రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి ఆమోద్యయోగ్యమైన నగరం విశాఖ అని, అందుకే విశాఖను రాజధానిగా చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెత్తందారులకు.. పేదల పక్షాన నిలబడ్డ తనకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.. ప్రజలంతా ఈ యుద్ధంలో తనకు అండగా ఉండాలని కోరారు. '' మీ బిడ్డ ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేలా పని చేస్తున్నాడు... మీకు లబ్ధి చేకూరిందని నమ్మితేనే నాకు ఓటేసి ఆశీర్వదించండి '' అని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ ను సిఎం జగన్‌ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com