బహ్రెయిన్ లో పెరుగుతున్న క్యాట్‌కాలింగ్ ఫిర్యాదులు..!

- April 20, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో పెరుగుతున్న క్యాట్‌కాలింగ్ ఫిర్యాదులు..!

బహ్రెయిన్:  బహ్రెయిన్ వీధుల్లో క్యాట్ కూలింగ్ (లైంగిక వేధింపులు) కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. తాము వీధుల్లో వెళ్లే క్రమంలో తరచూ వేధింపులకు గురవుతున్నట్లు పలువురు యువతులు, మహిళలు అధికారులకు ఫిర్యాదులు చేయడం ఇటీవల పెరిగినట్లు ఓ భద్రతా అధికారి తెలిపారు. కానీ చాలామంది ఇలాంటి విషయాలను అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంతో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని సదరు అధికారి చెప్పారు.

క్యాట్‌కాలింగ్ అంటే..

వీధుల్లో లేదా ఎక్కడైనా యువతులు, మహిళలను తమ వైపుకు పిలవాలని ఎవరైనా(నిందితులు) కోరుకున్నప్పుడు- ఆమెను కించపరచడానికి క్యాట్‌కాలింగ్(వేధింపులు) చాలా తరచుగా జరుగుతుంది. చాలా సార్లు, నేరస్తుడు కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ, ఆమె శరీరాన్ని ఒక వస్తువుగా భావించి వ్యాఖ్యలు చేస్తుంటారు. దురదృష్టవశాత్తు, మహిళలు వీధిలో నడుస్తున్నా, బైక్ నడుపుతున్నా లేదా డ్రైవింగ్ చేసినా, చాలా మంది మహిళలు క్యాట్‌కాలింగ్ లేదా వీధి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఓ పద్దెనిమిదేళ్ల బహ్రెయిన్ అమ్మాయి తన అనుభవాలను తెలుపుతూ.. దురదృష్టవశాత్తు క్యాట్‌కాలింగ్ చాలా సాధారణంగా మారిందన్నారు. తనలాంటి చాలా మంది అమ్మాయిలు అలాంటి చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదన్నారు. అయితే, వీటిని అడ్డుకునేందుకు నేరస్థుల వెహికిల్ నంబర్ ప్లేట్ చిత్రాలను తీయడం ప్రారంభించానని ఆమె తెలిపింది. ఇలాంటి చర్యల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, కానీ ఇలా ఫోటోలు, వీడియోలు తీస్తే.. వారు కాస్తా భయపడి వెనక్కి తగ్గే అవకాశం ఉందని, దాంతో భవిష్యత్తులో వారు ఇతరులను క్యాట్‌కాల్ చేయకుండా నిరోధించవచ్చని ఆమె చెప్పింది. మహిళలు క్యాట్‌కాలింగ్ లేదా వీధి వేధింపుల భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, ఇలాంటి ఘటనలు ఎదురైన సందర్భాల్లో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com