భారత్ కరోనా అప్డేట్
- April 20, 2023
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత దేశంలో కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,591 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 40 మంది మృతి చెందారు. బుధవారం నమోదైన కేసులతో పోల్చితే 20 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 65,283 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









