నాలుగేళ్లుగా కారునే జీవనం..భారతీయ మహిళకు అండగా నిలిచిన కాన్సులేట్
- April 21, 2023
యూఏఈ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా కారులో జీవిస్తున్న 55 ఏళ్ల భారతీయ జాతీయురాలు ప్రియా ఇంద్రు మణికి దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. తల్లికి పక్షపాతం రావడం, వ్యాపారంలో నష్టాలు వెరసి దుబాయ్‌లోని బార్షా హైట్స్‌లోని డెసర్ట్ స్ప్రింగ్స్ విలేజ్‌లోని తన విల్లాకు అద్దె చెల్లించలేకపోయింది. కొన్నాళ్లు ఒక హోటల్లో ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో కారులోనే నివసించవలసి వచ్చింది. సహాయం చేయాలని భారతీయ కాన్సులేట్‌ను మణి సంప్రదించగా.. విల్లా యజమానితో కాన్సులేట్ సిబ్బంది మాట్లాడారు. రమదాన్ సందర్భంగా దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) బాకీతో సహా ఆమె మిగిలిన అప్పులను తీర్చడానికి అనేక మంది వ్యక్తులు ముందుకు వచ్చారు. కార్ ఫేర్ గ్రూప్ ఎండీ జస్బీర్ బస్సీ అద్దె కోసం AED 50,000, DEWA ఛార్జీల కోసం సుమారు AED 30,000 అందించారు. దాతల సహకార ప్రయత్నాల కారణంగా.. కాన్సులేట్ సమన్వయంతో మణికి ఆర్థిక ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన వారికి మణి కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు ఉత్సాహాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. మణి పరిస్థితిని పరిష్కరించడంలో సానుభూతితో సహకరించినందుకు వినయ్ చౌదరి, అనీష్ విజయన్, జస్బీర్ బస్సీలకు కాన్సులేట్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. ఇలాంటి చొరవలు యూఏఈలో భారతీయ సమాజంలోని బలమైన బంధాలకు ఉదాహరణగా నిలుస్తాయని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







