ఈద్ అల్-ఫితర్: HM సుల్తాన్ శుభాకాంక్షల వెల్లువ
- April 21, 2023
మస్కట్: 1444 AH ఈద్ అల్-ఫితర్ ఆగమనం సందర్భంగా ఒమన్ సుల్తానేట్‌లోని మంత్రివర్గ సభ్యులు, రక్షణ రంగ ఉన్నతాధికారుల నుండి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు అందుకున్నారు. శ్రేయోభిలాషులు సుల్తాన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు.. మంచి ఆరోగ్యం, ఆనందాన్ని పొందాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో హెచ్‌హెచ్ సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సైద్(మంత్రి మండలి ఉప ప్రధాన మంత్రి), హెచ్‌హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్( రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి), సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ( దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి), జనరల్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ నుమాని( రాయల్ ఆఫీస్ మంత్రి, సుప్రీం కమాండర్ కార్యాలయం అధిపతి), షేక్ అబ్దుల్మలిక్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీలీ( స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్), ఖలీద్ బిన్ హిలాల్ అల్ మావాలి( షురా కౌన్సిల్ ఛైర్మన్), లెఫ్టినెంట్ జనరల్ హసన్ బిన్ మొహసేన్ అల్ ష్రైకీ(ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్), లెఫ్టినెంట్ జనరల్ సెయిడ్ బిన్ అలీ అల్ హిలాలీ( ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ హెడ్) ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







