స్వలింగ సంసర్కుడయినందుకు చంపేశారు!
- May 09, 2016
ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం పైనుంచి కిందికి నెట్టి చంపేయడం వారి రాక్షసత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. అతడు స్వలింగ సంపర్కుడు కావడమే అందుకు కారణంగా ఐసిస్ వివరించింది. అనాగరికమైన ఆ చర్య.. అలెప్పో రాష్ట్రంలోని మన్బిజ్ లో చిన్న పిల్లలు సహా అందరూ చూస్తుండగా జరిగింది. స్వలింగ సంపర్కుడవ్వడంతో ఓ యువకుడి ప్రాణాలను ఐసిస్ బలి తీసుకుంది. ఓ ఎత్తైన భవనం పైనుంచి అతన్నిఅనాగరికంగా కిందికి విసిరేసిన ముగ్గురు ఉగ్రవాదులు, అతడిపై కిరాతకంగా వ్యవహరించి, అతడి ప్రాణాలను గాల్లో కలిపేశారు. అలెప్పో రాష్ట్రం మన్బిజ్ లో జరిగిన అమానవీయ ఘటనకు ప్రపంచం నివ్వెరపోయింది. జిహాదీలు తాజాగా విడుదల చేసిన చిత్రాలు అలెప్పోలో జరిగిన రాక్షస చర్యకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. స్వలింగ సంసర్కుడన్న ఆరోపణతో చిన్నపిల్లలు సహా డజన్లకొద్దీ జనం చూస్తుండగానే ఆ ఉగ్రమూక యువకుడికి తీవ్రమైన శిక్ష విధించింది. చంపేసేందుకు ముందు.. కళ్ళకు గంతలు కట్టి, చెప్పుల్లేకుండా నిర్మాణంలో ఉన్న భవనంపై ఇస్లామిక్ ఫైటర్స్ యువకుడ్ని నిలబెట్టినట్లు ఓ ఫొటోలోని వివరాలను బట్టి తెలుస్తుంటే... మరో చిత్రంలో అతడికి మరణశిక్షను విధిస్తూ ఐదంస్తుల భవనం పై నుంచీ కిందికి తోసేయడం స్పష్టంగా కనిపించడమే కాక... ఐసిస్ వికృత చర్యలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
యువకుడు భవనంపైనుంచి కింద పడేందుకు ముందుగా రూఫ్ పై అతడి వద్ద నిలబడ్డ ముగ్గురు జిహాదీలు ఐసిస్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ తాజా ఫొటోలను విడుదల చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదేరకంగా ఇంతకు ముందుకూడ ఐసిస్ ఓ యువకుడి పట్ల ప్రవర్తించినట్లు ఆధారాలు చెప్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







