'ఈద్ జాయ్' కార్యక్రమంలో 5,000 బహుమతుల పంపిణీ
- April 22, 2023
దోహా: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పిల్లలకు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ "ఈద్ జాయ్" కార్యక్రమంలో భాగంగా 5,000 బహుమతులను పంపిణీ చేసింది. ఎండోమెంట్ బ్యాంక్ మద్దతుతో ఖతార్ అంతటా మస్జీదులలో బహుమతులు పంపిణీ చేశారు. "ఎండోమెంట్ ఈజ్ ఎ కమ్యూనిటీ పార్టనర్షిప్" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఖతార్‌లో కమ్యూనిటీ డెవలప్మెంట్, మానవ సంరక్షణను సాధించడంలో ప్రభావవంతంగా దోహదపడేందుకు, ప్రభుత్వ- ప్రైవేట్ సంస్థల సహకారం ద్వారా సమాజంలోని అనేక రంగాలకు.. దాని వివిధ విభాగాలకు సేవ చేయడం కోసం పాటుపడుతున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎండోమెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎండోమెంట్ బ్యాంక్‌లలో బదిలీ చేయాలనుకునే వారు ఆమోదించబడిన పద్ధతుల ద్వారా ఎండోమెంట్‌ను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు









