భారత్ లో కొత్తగా 12,193 కరోనా కేసులు
- April 22, 2023
న్యూఢిల్లీ: భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,193 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించాయని వెల్లడించింది. వీరిలో పది మంది కేరళవాసులని తెలిపింది. తాజాగా లెక్కల ప్రకారం..కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం 5,31,300 మంది అసువులు బాసారు.
ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతమని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







