బొప్పాయి తింటున్నారా.? ఈ జాగ్రత్తలు పాఠిస్తే మంచిది.!

- April 22, 2023 , by Maagulf
బొప్పాయి తింటున్నారా.? ఈ జాగ్రత్తలు పాఠిస్తే మంచిది.!

బొప్పాయి పండు. చూడగానే నోరూరించే పండు. అరోగ్యానికి ముఖ్యంగా డెంగ్యూతో బాధపడేవారు బొప్పాయి అధికంగా తింటే ప్లేట్‌లెట్స్ వృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతారు. బొప్పాయి పండుతో పాటూ, ఆకు రసం కూడా డెంగ్యూ టైమ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. 
అవును నిజమే, బొప్పాయిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా వుంటాయ్. బొప్పాయి పండును గర్భిణీ స్ర్తీలు తింటే గర్భస్రావం అవతుందని అంటారు. బాలింతలు పచ్చి బొప్పాయి కూరను తింటే బిడ్డకి సరిపడా పాలు పడతాయని అంటున్నారు. 
సరే, ఆ సంగతి పక్కన పెడితే, కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, కొన్నిరకాల ఆహార పదార్ధాలతో బొప్పాయిని కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్న మాట.
పెరుగుతో బొప్పాయిని కలిపి తీసుకోకూడదట. అలా చేస్తే రక్త హీనత సమస్య తలెత్తుతుందట.
అలాగే, ఆరెంజ్, నిమ్మకాయలతో కలిపి బొప్పాయి పండు తీసుకోవడం మంచిది కాదట. అలా చేయడం వల్ల విరుద్ధమైన జీవక్రియ జరిగి అతిసారం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయట. 
సో, బొప్పాయితో కాస్త జాగ్రత్త సుమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com