సుధీర్ బాబు ట్రిపుల్ ధమాకా.! కొంచెం కొత్తగా ట్రై చేశాడుగా.!
- April 22, 2023
వెర్సటైల్ యాక్టర్‌గా సుధీర్ బాబుకి మంచి పేరుంది. ఆయన సినిమాల్లో కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వుంటాడు. అలా హిట్, ఫట్ అనే తేడాల్లేకుండా ఒక ప్రత్యేకమైన సక్సెస్‌ని దక్కించుకున్నాడు హీరోగా సుధీర్ బాబు.
అయితే, ఈ మధ్య సుధీర్ బాబు చేస్తున్న సినిమాలు ఆయన కెరీర్‌కి పెద్దగా కలిసి రావడం లేదు. తాజాగా ‘మామా మశ్చింద్ర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు.
ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. విభిన్నమైన లుక్స్ ట్రై చేశాడు ఆయా పాత్రల కోసం. ఈ పాత్రల ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
లేటెస్టుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘దేవుడు అడిగాడట.. నన్ను చేరాలంటే ఏడు జన్మలు నా భక్తుడిలా వుంటావా.. లేక మూడు జన్మలు రాక్షసుడిలా వుంటావా అని. ఏడు జన్మలు నీకు దూరంగా వుండే కన్నా మూడు జన్మలు రాక్షసుడిలా బతకడమే మిన్న.. అని దేవతలే కోరుకుంటున్నారట..’ అంటూ మొదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.
ఓ పాత్ర కోసం సుధీర్ బాబు పక్కా తెలంగాణా యాసలో మాట్లాడుతున్నాడు.. టీజర్ చూస్తుంటే, ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలానే వుంది. ఆథ్యంతం ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్గా టీజర్ కట్ చేశారు. చూడాలి మరి, ఈ సినిమాతో సుధీర్ బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







