ఈద్ అల్ ఫితర్: ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన యూఏఈ అధ్యక్షుడు

- April 22, 2023 , by Maagulf
ఈద్ అల్ ఫితర్: ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుటుంబ ఫోటోను ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పంచుకున్నారు.  “సెలవులను కుటుంబం, ప్రియమైనవారితో గడపడం ఒక వరం. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ, ప్రపంచ ప్రజలు శాంతి, సంతోషాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను" అని యూఏఈ  అధ్యక్షుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు 3.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం, ఈద్ అల్ ఫితర్ విరామ సమయంలో షేక్ మొహమ్మద్ తన మనవరాళ్లతో ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు రోజు షేక్ మొహమ్మద్ ఎమిరేట్స్ పాలకులు, పౌరులు, నివాసితులు, అరబ్ , ఇస్లామిక్ దేశాల నాయకులకు,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com