దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ కొత్త సర్వీస్ వేళలు ఇవే
- April 23, 2023
దోహా: ఏప్రిల్ 24 నుండి మెట్రో, లుసైల్ ట్రామ్ కొత్త సర్వీస్ వేళలను ప్రకటించాయి. వారంలో ఏడు రోజులపాటు ఉదయం 5:30 నుండి ప్రయాణికులకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపాయి. కొత్త సర్వీస్ వేళల ప్రకారం.. ఆదివారం నుండి బుధవారం వరకు.. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ ఉదయం 5:30 నుండి రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటాయి. గురువారం మాత్రం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం సర్వీసులు మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు.. శనివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, ఈ సర్వీసులు రమదాన్ వేళలను అనుసరిస్తోంది. దీని ప్రకారం ఇది వారాంతపు రోజులలో ఉదయం 6:30 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు పనిచేస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!









