సెక్స్ చేంజ్ ఆపరేషన్లకు సెంటర్‌గా మారిపోతోంది భారత్
- May 09, 2016
సెక్స్ చేంజ్ ఆపరేషన్లకు సెంటర్‌గా మారిపోతోంది భారత్. దేశంలో ఈ అపరేషన్లకు చౌకగా చేస్తుండడంతో మగవారుగా మారాలనుకుంటున్న ఆడవాళ్లు, ఆడవాళ్లుగా మారాలనుకుంటున్న మగవాళ్లు విదేశాల నుంచి భారత్‌కు క్యూ కడుతున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన 64 ఏళ్ల మాజీ సైనికుడు బెట్టీ అన్ ఆర్చర్ సెక్స్ చేంజ్ ఆపరేషన్ కోసం భారత్ వచ్చారు. 'డలేలో పుట్టి పెరిగిన నేను తప్పుడు శరీరంలో ఇరుక్కుపోయానని ఎప్పుడూ బాధ పడుతూ ఉండేవాడిని. నా శరీరాన్ని నేను ధ్వేషిస్తూ వచ్చాను. నేను నేనులాగా ఉండేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. 2011లో నేను తీవ్రంగా జబ్బు పడ్డాను. కోలుకుంటున్న సమయంలో నేను చావనైనా చావాలి లేదా సెక్స్ చేంజ్ ఆపరేషన్ ద్వారా మహిళగానైనా మారిపోవాలని నిర్ణయించుకున్నాను.
ఆపరేషన్ గురించి వాకబు చేయడం మొదలు పెట్టాను. ఇలాంటి ఆపరేషన్లు థాయ్‌లాండ్‌లో ఎక్కువగా చేస్తున్నారని తెల్సింది. అక్కడ ఖర్చు ఎక్కువవుతుందని తెల్సింది. భారత్‌లో చౌకగా చేస్తారని తెల్సింది. అంతే భారత్‌కు వచ్చాను. ఉత్తర ఢిల్లీలోని ఓల్మెక్ సెంటర్ క్లినిక్‌లో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్‌కు ఆరువేల డాలర్లు ఛార్జ్ చేశారు. థాయ్‌లాండ్‌లో అపరేషన్‌కు అయ్యే ఖర్చులో ఇది ఐదోవంతు. సంతోషంగా పురుషుడి నుంచి మహిళగా మారిపోయాను. ఆపరేషన్ ముందు, ఆ తర్వాత కేర్‌కు, షాపింగ్‌లకు, ఆ తర్వాత భారత్ పర్యటనకు, విమాన ఛార్జీలు అన్నీ కలుపుకొని నాకు కేవలం 22 వేల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి' అని నీలి రంగు చీరకట్టుకొని మెడలో భారతీయ సంప్రదాయం ప్రకారం నగలు ధరించిన ఇక అతడుకాని ఆమె వివరించారు.
సెక్స్ చేంజ్ ఆపరేషన్ల కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి తన క్లినిక్ తెగ వస్తున్నారని ఓల్మెక్ క్లినిక్ వ్యవస్థాపకులు, ప్లాస్టిక్ సర్జన్ నరేంద్ర కౌషిక్ మీడియాకు తెలిపారు. ఏడాదికి 20కిపైగా ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్నానని ఆయన చెప్పారు. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. ఇటీవల రిటైర్డ్ బ్రిటిష్ వయోలనిస్ట్ రోజి మికా కెల్లెట్ కూడా సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేశామని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్‌లో భారత్లోకన్నా డబుల్ ఖర్చు అవుతుందని అన్నారు. మెడికల్ టూరిజం పరిశ్రమను భారత్ ప్రోత్సహిస్తుండడంతో విదేశీ రోగుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







