స్పాన్సర్ మార్పు.. గృహ కార్మికురాలి కేసును తిరస్కరించిన అప్పీల్ కోర్టు
- April 25, 2023
బహ్రెయిన్: విదేశీ ఉద్యోగులు తన స్పాన్సర్ నియమాలు, హక్కులను గౌరవించాలని.. ఒప్పందం ప్రకారం కనీసం ఒక సంవత్సరం పనిచేయకుండా.. మరొక స్పాన్సర్ వద్దకు వెళ్లే హక్కు లేదని హై అప్పీల్స్ కోర్టు స్పష్టం చేసింది. బహ్రెయిన్ మ్యాన్, ఆసియా ఉమెన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) నిర్ణయాన్ని రద్దు చేయాలని దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ఆసియా మహిళ స్పాన్సర్‌షిప్‌ను బహ్రెయిన్ వ్యక్తికి బదిలీ చేయడానికి కోర్టు నిరాకరించింది. ఆమె మొదటి స్పాన్సర్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఏడాది సర్వీస్ రూల్స్ పాటించకుండా పారిపోయిందని కోర్టు గుర్తించింది. ఆసియన్ మహిళ పారిపోయిన తర్వాత ఆమె స్పాన్సర్ నియమాలను, హక్కులను ఉల్లంఘించిందని పేర్కొంటూ కోర్టు వారి కేసును తిరస్కరించింది. ఆమెకు స్పాన్సర్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆసియా మహిళ గౌరవించలేదని కోర్టు పేర్కొంది. "ఆసియన్ మహిళ దరఖాస్తును తిరస్కరించడం వెనుక గల కారణాలు ఆమె తన స్పాన్సర్ నుండి పారిపోయి, ఒక సంవత్సరం పూర్తి కాకుండా కొత్త స్పాన్సర్‌లో చేరడం వల్లనే అని LMRA ధృవీకరించింది" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఫలితంగా, ఆసియా మహిళ చేసిన ఉల్లంఘన కారణంగా కోర్టు ఈ కేసును తిరస్కరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!







