రెమ్యునరేషన్ బాగా పెంచేసిన సంయుక్తా మీనన్.!
- April 25, 2023
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ మాట ముద్దుగుమ్మల విషయంలో బాగా వర్తిస్తుంది. సంయుక్తా మీనన్ ఈ రూల్ బాగా ఫాలో చేస్తోంది.
గోల్డెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చేసుకుంది ఆల్రెడీ సంయుక్తా మీనన్. లేటెస్టుగా ‘విరూపాక్ష’ సినిమాతో ఓ గోల్డెన్ హిట్ తన ఖాతాలో వేసేసుకుంది.
‘విరూపాక్ష’ సినిమా, హిట్‌తో పాటూ, సంయుక్తకి మంచి పేరు కూడా తెచ్చేసింది. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ‘విరూపాక్ష’లో నందినిగా సంయుక్తా మీనన్.
దాంతో, అమ్మడు రెమ్యునరేషన్ బాగా పెంచేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఓ మోస్తరు రెమ్యునరేషన్ అయితే, మొహమాటం లేకుండా నో చెప్పేస్తోందట.
దాంతో, తప్పని పరిస్థితుల్లో సంయుక్తని అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఓకే చేసుకుంటున్నారట. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సంయుక్త సైన్ కోసం ఎదురు చూస్తున్నాయట. వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









