‘PS 2’.! మణిరత్నం డ్రీమ్ ఈ సారైనా నెరవేరుతుందా.?
- April 25, 2023
సీనియర్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందింది ‘పొన్నియన్ సెల్వన్’. ఓ పాపులర్ నవల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాని రెండు భాగాలుగా మణిరత్నం రిలీజ్ చేస్తున్నారు.
ఆల్రెడీ మొదటి భాగం సో సోగా పేరు తెచ్చుకుంది. ఇక, రెండో భాగం రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 28న ‘పొన్నియన్ సెల్వన్ 2’ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం రెండో పార్ట్ ఊహించని విధంగా విజువల్ ఇంపాక్ట్ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.
విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రెండో భాగం అంచనాలకు తగ్గట్లుగా పెద్దగా బజ్ అయితే క్రియేట్ చేయడం లేదు. కానీ, రిలీజ్ తర్వాత ఓ మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చినా మణిరత్నం డ్రీమ్ నెరవేరినట్లే.
చూడాలి మరి. ఈ భారీ మల్టీ స్టారర్ ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఎలా వుండబోతోందో.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







