బియ్యం కడిగిన నీటితో అందం
- May 09, 2016
సాధారణంగా బియ్యం కడిగిన నీరు పారబోస్తాం లేదా పశువులకు తాగిస్తాం. అయితే ఈ నీటితో అందం పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయట. మొటిమలపైనా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి. బియ్యం కడిగిన నీటిలో మాములు టిష్యు పేపర్ ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. ఈ నీటితో ముఖంపై రాషెస్ ఉన్న ప్రదేశంలో నునుపుగా రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది. పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై రాషెస్ తగ్గుతాయి. బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుళ్లను కూడా శుభ్రం చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







