యూఏఈ లో ఈద్ అల్ అదా సెలవులు: భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ దేశాల జాబితా
- April 26, 2023
యూఏఈ: జూన్ చివరి వారంలో ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈ నివాసితులకు సుదీర్ఘమైన వారాంతం కానుంది. చంద్రుని వీక్షణ ఆధారంగా ఇవి జూన్ 27 నుండి జూలై 2 వరకు ఆరు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ప్రవాసులు, పౌరులు సుదీర్ఘ విరామ సమయంలో ప్రపంచంలోని వివిధ పర్యాటక అనుకూల దేశాలకు ప్రయాణిస్తారు. యూఏఈ జనాభాలో దాదాపు 36 శాతంకుపైగా భారతీయులు ఉన్నారు. సుమారు 3.5 మిలియన్ల మంది భారతీయులు యూఏఈలో పనిచేస్తున్నారు.
హెన్లీ & పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారతీయ పౌరులు తమ ఇండియన్ పాస్ పోర్టుతో థాయ్‌లాండ్, మాల్దీవులు, ఖతార్, ఒమన్, జోర్డాన్ , శ్రీలంక వంటి ప్రముఖ గమ్యస్థానాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 60 వీసా-రహిత గమ్యస్థానాలకు ప్రవేశాన్ని పొందవచ్చు. కాగా యూఏఈ పౌరులు 178 దేశాలలో వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ పొందవచ్చు.
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌ల కోసం వీసా రహిత దేశాల జాబితా:
అల్బేనియా (భారత జాతీయులకు అల్బేనియా కోసం వీసా అవసరం. అయితే, 10 సంవత్సరాల గోల్డెన్ వీసా ఉన్న యూఏఈ నివాసితులు వీసా లేకుండా దేశానికి ప్రయాణించవచ్చు), ఖతార్, ఒమన్, జోర్డాన్, ఇరాన్, కుక్ దీవులు, ఫిజీ, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నియు, పలావు దీవులు, సమోవా, తువాలు, వనాటు, బార్బడోస్, బ్రిటిష్, వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా,సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, కజకిస్తాన్, లావోస్, మకావో, మాల్దీవులు, మయన్మార్,నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, తైమూర్-లెస్టే,బొలీవియా, ఎల్ సల్వడార్, బోట్స్వానా,బురుండి, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, ఇథియోపియా, గాబోన్, గినియా-బిస్సావు, మడగాస్కర్, మౌరిటానియా, మారిషస్, మొజాంబిక్, రువాండా,సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, టాంజానియా, ట్యునీషియా, ఉగాండా, జింబాబ్వే.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







