తండ్రి, కుమార్తెలకు షాకిచ్చిన కోర్టు.. BD15,000 రీఫండ్ చేయాలని ఆదేశం
- April 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ టీచర్స్ కాలేజీలో చదివి, అనంతరం ఒప్పందాన్ని ఉల్లంఘించిన బహ్రెయిన్ వ్యక్తి, అతని కుమార్తెలకు హై సివిల్ కోర్టులో చుక్కెదురైంది. విద్యా మంత్రిత్వ శాఖకు BD15,000 రీఫండ్ చేయాలని హై సివిల్ కోర్ట్ వారిని ఆదేశించింది. కేసు రికార్డుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసినందుకు ప్రతిఫలంగా బహ్రెయిన్ టీచర్స్ కాలేజీలో తన చదువును పూర్తి చేసేందుకు మంత్రిత్వ శాఖ తన కుమార్తెకు స్పాన్సర్‌షిప్ ఇచ్చింది. అయితే, ఆమె తన చదువు తర్వాత దేశం విడిచి వెళ్లింది. ఆమె విద్య కోసం ఆమె అందుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఆమెపై ఫిర్యాదు చేసింది. "ఆమె ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆమె తన తండ్రితో కలిసి దేశం విడిచి వెళ్లింది. దేశంలో ఆమె పని చేయలేనని పేర్కొంది." అని మంత్రిత్వ శాఖ న్యాయవాది చెప్పారు. సివిల్ కోర్ట్ మంత్రిత్వ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒప్పందం షరతులను పాటించడంలో సదరు స్టూడెంట్ విఫలమైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతివాదులు విద్యా మంత్రిత్వ శాఖకు BD15,000 చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







