షార్జా జైలు నుండి విడుదలైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా
- April 27, 2023
ముంబై: అరెస్టయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. బుధవారం షార్జా సెంట్రల్ జైలు నుండి విడుదలైనట్లు అధికారులు తెలిపారు. జైలు నుండి విడుదలైన అనంతరం తల్లి ప్రమీలా పెరీరాతో మాట్లాడిన వీడియోను ఆమె సోదరుడు కెవిన్ పెరీరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. క్రిసాన్ విడులైందని.. వచ్చే 48 గంటల్లో భారత్‌కు తిరిగి వస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ ఆరోపణలతో ఆమె ఈ నెల 1న షార్జాలో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఇది పథకం ప్రకారం ఆమెను ఇరికించేందుకు జరిగిన కుట్రగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు ఆంథోనీ పాల్, అతని సన్నిహితుడు రాజేష్ బబొటేలను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం..పెరారీ తల్లి పెంచుకుంటున్న కుక్క కారణంగా ఆమెకు , ఆంథోనీ సోదరికి గతంలో వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆంథోనీ క్రిసాన్ పెరీరా షార్జాకు తీసుకెళ్లిన ట్రోఫీలో డ్రగ్స్ దాచిపెట్టారు. ఆంథోనీ , అతని సహచరుడు రాజేష్‌తో కలిసి, అంతర్జాతీయ వెబ్ సిరీస్ కోసం ఉద్దేశించిన ఆడిషన్ కోసం క్రిసాన్‌ను యూఏఈకి పంపడానికి పథకం పన్నాడు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా, డ్రగ్స్ దాచిన ట్రోఫీని ఆమెకు అందించారు. అనంతరం జైలు నుండి బయటకు తీసుకువచ్చేందుకు రూ. 80 లక్షలు ఇవ్వాలని క్రిసాన్ తల్లిని డిమాండ్ చేశారు. సంబంధిత ఆధారాలను షార్జా అధికారులకు పంపడంతో ఆమెను బుధవారం విడుదల చేశారు. క్రిసాన్ సడక్ 2, బాట్లా హౌస్ సినిమాల్లో నటించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







