గుదైబియా రెసిడెన్షియల్ అగ్నిప్రమాదంలో మహిళ మృతి

- April 27, 2023 , by Maagulf
గుదైబియా రెసిడెన్షియల్ అగ్నిప్రమాదంలో మహిళ మృతి

బహ్రెయిన్: గుదైబియాలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ఆసియా మహిళ(36) ఊపిరాడక మరణించింది. నివాసితులను ఆ భవనం నుంచి ఖాళీ చేయించడానికి సివిల్ డిఫెన్స్ బృందాలు అర్ధరాత్రి వరకు శ్రమించాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ కంట్రోల్ రూమ్‌ పరిస్థితులను సమీక్షించింది. సమాచారం అందగానే ఎనిమిది వాహనాలు, 26 మంది అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని డైరెక్టరేట్ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ఇంట్లోని ఎయిర్ కండీషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మరోవైపు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గత రెండేళ్లలో దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలలో తనిఖీలు చేపట్టి అగ్ని రక్షణ వ్యవస్థలకు సంబంధించి 774 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com