యాంటిబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!

- April 27, 2023 , by Maagulf
యాంటిబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!

ఏ చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్లు, ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా యాంటి బయాటిక్స్ చక చకా వాడేస్తుంటాం. అయితే, అది అస్సలు మంచి పద్దతి కాదనీ, ఆరోగ్యానికి యాంటి బయాటిక్స్ చేసే నష్టం అంతా ఇంతా కాదని తాజాగా ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ముఖ్యంగా యాంటిబయోటిక్స్ వాడకంలో ఈ అధ్యయనం ద్వారా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయ్. 
ఇష్టమొచ్చినట్లు యాంటి బయాటిక్స్ వాడడం వల్ల పేగుల్లో వుండే మంచి బ్యాక్టీరియా నశించిపోతుందని తద్వారా విపరీతమైన గ్యాస్ సంబంధిత రోగాలు, ఊబకాయం, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయట. 
అంతేకాదు, అతి తీవ్రమైన గుండె నొప్పికీ యాంటి బయాటిక్స్ వాడకం ముప్పు కానుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మానవ శరీరంలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనే రెండు రకాల బ్యాక్టీరియా జాతులుంటాయ్.
యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడకంతో ఆ గుడ్ బ్యాక్టీరియాని, బ్యాడ్ బ్యాక్టీరియా ప్రభావితం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటూ, దీర్ఘ కాలిక వ్యాధులు, ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com